Telangana: నేడు అమిత్‌షాతో బీజేపీ నేతల భేటి

Telangana: నేడు అమిత్‌షాతో బీజేపీ నేతల భేటి
వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు

తెలంగాణపై బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పూర్తిగా దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు. అమిత్‌షా కార్యాలయం పిలుపు మేరకు సోమవారం హుటాహుటిన ఢిల్లీకి చేరుకున్న తెలంగాణ బీజేపీ నేతలు ఈ రోజు(మంగళవారం) అమిత్‌షాతో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో అసెంబ్లీ ఎన్నికలతో పాటు భవిష్యత్‌ కార్యచరణపై చర్చించనున్నారు. తెలంగాణ మిషన్‌ 90 ఆపరేషన్‌ కొనసాగిస్తోంది. దీన్ని పక్కా అమలు చేసందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై రాష్ట్ర నేతలతో దిశనార్ధేశం చేయనున్నారు అమిత్‌షా. రాష్ట్ర బీజేపీ నాయకత్వానికి పది నెలల రోడ్‌ మ్యాప్‌ ఇస్తున్నట్లు తెలుస్తోంది.

కార్నర్‌ మీటింగ్‌ రివ్యూతోపాటు భవిష్యత్ కార్యాచరణపై చర్చించే అవకాశం ఉంది. అదేవిధంగా రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై షా స్వయంగా అడిగి తెలుసుకుంటున్నారు. కాగా నిన్న అమిత్‌షా కార్యా లయం నుండి ఢిల్లీకి రావాలని రాష్ట్ర బీజేపీ ముఖ్య నేతలకు పిలుపువచ్చింది. ఈ నేపథ్యంలో హుటాహుటిన ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు తెలంగాణ బీజేపీ నేతలు.

Tags

Read MoreRead Less
Next Story