Telangana: రేవంత్‌పై కోడిగుడ్లు, టమోటాలు విసిరిన బీఆర్ఎస్ కార్యకర్తలు

భూపాలపల్లిలో మంగళవారం రాత్రి హైటెన్షన్ నెలకొంది. హాథ్ సే హాథ్ జోడో యాత్రలో భాగంగా రేవంత్ రెడ్డి ప్రసంగి స్తుండగా.. బీఆర్ఎస్ కార్యకర్తలు విరుచుకుపడ్డారు. రేవంత్‌పై కోడిగుడ్లు, టమోటాలు విసిరారు. దీంతో బీఆర్ఎస్ కార్యకర్తల్ని పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించినా.. పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో కాటారం ఎస్సై శ్రీనివాస్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు. మరో వైపు.. రేవంత్ రెడ్డి సభలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్ కార్యకర్తల్ని పోలీసులు అడ్డ గించి, స్థానిక సినిమా థియేటర్‌లో బంధించారు.
దాడిపై రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. తనపై కోడిగుడ్లు, టమోటాలు విసరడం కాదని.. దమ్ముంటే సభ వద్దకు రావాలని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డికి సవాల్ విసిరారు. తాను తలచుకుంటే.. నీ ఇల్లు ఉండదంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇదే సమయంలో జిల్లా ఎస్పీపై కూడా రేవంత్ నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ సభ ఉందని తాము ఒక రోజు వాయిదా వేసుకున్నామని.. కానీ దాడులు జరుగు తుంటే మీరు పట్టించుకోవడం లేదంటూ ఎస్పీపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com