Telangana: సిరిసిల్లలో రేవంత్ హాత్ సే హాత్

తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హాత్ సే హాత్ జోడో యాత్ర రాజన్న సిరిసిల్ల జిల్లాలో కొనసాగుతోంది.. పాదయాత్రలో భాగంగా శ్రీపాద 9వ ప్యాకేజీ పనులను ఆయన సందర్శించారు. అసంపూర్తిగా ఉన్న కాలువను పరిశీలించారు.. స్పాట్‌లోనే అధికారులకు ఫోన్ చేసిన రేవంత్ రెడ్డి కాలువ పనులు పూర్తిచేయకపోవడానికి కారణాలను అడిగి తెలుసుకున్నారు. పనులు ఆలస్యం చేయడం ద్వారా అంచనా వ్యయం పెరిగే అవకాశం ఉందన్నారు.
పనులు సరిగా చేయడం లేదన్న నెపంతో కేటీఆర్ తన అనుయాయులకు పనులు అప్పగించారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కాలువ పనులు పూర్తి చేయకుండా అసంపూర్తిగా ఉంచారని ఫైరయ్యారు. లాభాలు దండుకుని మిగిలిన పనులను గాలికొదిలేశారని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. పనులు ఆలస్యం కావడానికి, అంచనా వ్యయం పెరగడానికి కారణమైన సంస్థ గుర్తింపును రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.. ఇక్కడి ప్రాంత రైతులపై ఆ కాంట్రాక్టర్లకు ప్రేమ లేదన్నారు. కేటీఆర్ కాంట్రాక్టర్లకు లొంగిపోవడం వల్లే పనులు ఆలస్యమయ్యాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు. తక్షణమే 9వ ప్యాకేజీ పనులు పూర్తిచేయాలని డిమాండ్ చేశారు.. లేని పక్షంలో స్థానిక నాయకత్వం దీనిపై పోరాడుతుందని స్పస్టం చేశారు. శ్రీపాద 9వ ప్యాకేజీ పనులు పరిశీలించిన అనంతరం పవర్ లూమ్ కార్మికులతో రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అందరికీ న్యాయం జరుగుతుందని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com