Telangana: నేడు బండి దీక్ష

బీఆర్ఎస్ సర్కార్‌పై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సమర భేరి మోగించారు. రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యలు, మహిళలపై అత్యాచారాల ఘటనలపై దీక్షకు సిద్ధమయ్యారు. సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద పార్టీ శ్రేణులతో కలిసి దీక్ష చేయనున్నారు. బీఆర్ఎస్ పాలనలో శాంతిభద్రతలు క్షీణించాయని, మహిళలపై దాడులు, అత్యాచారాలు పెరిగిపోతున్నాయని బీజేపీ ఆరోపిస్తోంది. ఇక బండి సంజయ్ దీక్షకు సంబంధించి పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నారు. బండి సంజయ్ దీక్ష నేపథ్యంలో అటు పోలీసులు అప్రమత్తం అయ్యారు.
ఇటీవల మహిళా మోర్చ సమావేశంలో ఇదే విషయాన్ని బండి సంజయ్ ప్రస్తావించారు. మహిళలకు రక్షణ కల్పిచడంలో కేసీఆర్ విఫలం అయ్యారని అదే తాము అధికారంలోకి వస్తే మహిళలపై అత్యాచారాలు చేసే వాళ్ల అంతుచూస్తామని హెచ్చరించారు. అంతే కాదు యూపీ తరహాలో బుల్డోజర్లతో నిందితుల ఇళ్లు కూల్చేస్తామని అన్నారు. మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతుంటే సీఎం, హోం మంత్రి ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com