Telangana: ఒక్క జీ.ఓతో డైలమాలో పడ్డ కౌన్సిలర్లు

Telangana: ఒక్క జీ.ఓతో డైలమాలో పడ్డ కౌన్సిలర్లు
X
అవిశ్వాసం ఉంటుందా..? ఉండదా.. అన్నది. జీఓ వస్తుందో లేదో తెలియని పరిస్థితి

ఒక్క జీ.ఓతో కౌన్సిలర్లంతా... డైలామాలో పడిపోయారు. కౌన్సిలర్లే కాదు స్థానిక శాసనసభ్యులదీ అదే పరిస్థితి. అవిశ్వాసం ఉంటుందా..? ఉండదా.. అన్నది. జీఓ వస్తుందో లేదో తెలియని పరిస్థితి. అది వచ్చేంత వరకూ పరిస్థితి కొలిక్కి వచ్చేలా కనిపించడం లేదు.ఉమ్మడి మెదక్‌ జిల్లాలోఅవిశ్వాస కౌన్సిలర్లకు దిక్కుతోచని పరిస్థితి. . చివరికి సీఎం కేసీఆర్‌కు కూడా అవిశ్వాసం తలనొప్పి తప్పడం లేదు.గజ్వేల్‌తో పాటు ఏకంగా నాలుగు మున్సిపాల్టీల్లో అవిశ్వాసం నోటీసు ఇచ్చేశారు. నాలుగు మున్సిపాల్టీల్లోనూ...అధికార బిఆర్ఎస్‌ పార్టీ ఛైర్మన్లే ఉన్నారు.ఈ కొత్త తలనొప్పి బీఆర్‌ఎస్‌ నేతలకు బొప్పి కడుతోంది. అవిశ్వాసం వద్దనలేరు.. గో హెడ్‌ అనలేరు.

మరోవైపు సంగారెడ్డి జిల్లాలో ఎనిమిది మున్సిపాల్టీలున్నాయి. అందులో ఇప్పటికే మూడు మున్సిపాల్టీల్లో అవిశ్వాస నోటీసు ఇచ్చేశారు. సంగారెడ్డిలో ముసలం మొదలైంది. మున్సిపల్‌ ఛైర్మన్‌ బొంగుల విజయలక్ష్మిరవి, వైస్‌ ఛైర్మన్‌ లతా విజయేందర్‌రెడ్డిపై అవిశ్వాసం పెడుతున్నట్లు అందరి కంటే ముందే నోటీసిలిచ్చారు సంగారెడ్డి కౌన్సిలర్లు. మొత్తం 38 మంది కౌన్సిలర్లుండగా 23 మంది అవిశ్వాసానికి మద్దతుగా సంతకాలు చేశారు. చైర్మన్‌, వైస్‌ ఛైర్మన్‌పై అవిశ్వాసానికి కలెక్టర్‌ శరత్‌కు నోటీసులిచ్చారు. చైర్మన్‌, వైస్‌ ఛైర్మన్‌ ఒంటెద్దు పోకడల కారణంగానే తాము అవిశ్వాసం పెట్టాల్సి వస్తుందని చెప్పారు.

ఇక సీఎం కేసీఆర్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్‌ మున్సిపల్‌లోనూ అవిశ్వాసం సెగలురేపుతోంది. మొత్తం 20 వార్డులున్న ఈ మున్సిపాలిటీలో ఛైర్మన్‌ తీరును నిరసిస్తూ 15 మంది కౌన్సిలర్లు అవిశ్వాసానికి మద్దతు ఇచ్చారు.దీంతో అధికార బిఆర్ఎస్‌లో కలకలం రేగుతోంది. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో నాలుగు మున్సిపాల్టీల్లో అవిశ్వాస నోటీసిలిచ్చారు. చేర్యాల మున్సిపల్‌లో అవిశ్వాసం పెట్టేందుకు కౌన్సిలర్లు సిద్దమై విరమించుకున్నారు. వరుసగా పెడుతున్న అవిశ్వాసాలు అధికార బిఆర్ఎస్‌ను కలవరపెడుతోంది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ పరిణామం తమకు ఇబ్బందికరంగా మారుతుందని ఎమ్మెల్యేలు, నాయకులు ఆందోళన చెందుతున్నారు.

ఇంత వరకూ బాగానే ఉంది. కానీ.. నాలుగేళ్ల గడువుపై జీ.ఓ గవర్నర్‌ వద్ద పెండింగ్‌లో ఉంది. అది ఇప్పట్లో వచ్చేలా కనిపించడం లేదు. కానీ, జీ.ఓ పేరు చెప్పి ప్రభుత్వం అవిశ్వాసాన్ని నిలిపివేసింది. దీంతో అవిశ్వాస నోటీసిలిచ్చిన కౌన్సిలర్లంతా డైలామాలో పడిపోయారు. ఎన్ని రోజులు క్యాంపులు ఉండాలో అర్థం కాని పరిస్థితి. గజ్వేల్‌ కౌన్సిలర్లైతే.. రాజీనామాకే సిద్ధపడుతున్నారు. మిగతా మున్సిపాల్టీల్లోనూ పాలన పడకేసింది. సమావేశానికి కూడా రాలేని పరిస్థితి. జీఓ వస్తే ఏదో ఒక నిర్ణయం తీసుకోవచ్చన్నది కౌన్సలర్ల వాదన.

Tags

Next Story