Telangana: రాష్ట్రవ్యాప్తంగా రంగుల హోళి

Telangana: రాష్ట్రవ్యాప్తంగా రంగుల హోళి
సాప్రదాయబద్దంగా నిన్న కామదహనం చేసి ఈ రోజు రంగుల్లో మునిగి తేలుతున్న యువతి,యువకులు, చిన్నాపెద్దలు

రాష్ట్రవ్యాప్తంగా హోళీ సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. సాప్రదాయబద్దంగా నిన్న కామదహనం చేసి ఈ రోజు యువతి,యువకులు, చిన్నాపెద్దా అందరూ రంగుల్లో మునిగి తేలుతున్నారు. హైదరాబాద్ బేగం బజార్‌లో హోలీ సంబరాలు ఘనంగా జరుపుకుంటున్నారు. రాజస్థాన్ సమాజ్‌కు చెందిన పలువురు పెద్ద సంఖ్యలో హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. గో వాట్స్ ఫౌండేషన్ బేగం బజార్ ప్రభాత్ పరివార్ ఆధ్వర్యంలో జరిగిన హోలీ వేడుకల్లో చిన్నా పెద్దా వేడుకల్లో పాల్గొన్నారు. స్థానిక రాజస్థానీలు పాటలు పాడుతూ హోలీ ఆడారు. మహిళలు ప్రత్యేక నృత్యాలు చేస్తూ వేడుకలు చేసుకున్నారు. నల్గొండ జిల్లాలోని మధురానగర్‌లో చిన్న పెద్దా తేడా లేకుండా హోలీ సంబరాలు సెలబ్రేట్ చేసుకున్నారు.చిన్నారులు, యువత ఆట పాటలు, తీన్మార్ స్టెప్పులతో అదరగొట్టారు. రంగులు చల్లుకుంటూ ఒకరి కొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. దీంతో వీధులన్నీ రంగుల మయంగా మారాయి. హోలీ వేడుకల్లో కెమికల్స్ కలిపిన రంగులు కాకుండా సహజసిద్ధంగా లభించే రంగులనే వాడాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది.

Tags

Read MoreRead Less
Next Story