Telangana: నకిరేకల్‌లో హోరా హోళి

Telangana: నకిరేకల్‌లో హోరా హోళి
ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం పోటీ పోటీగా హోలీ సంబరాలను నిర్వహించడం వివాదస్పదమయింది

నల్లగొండ జిల్లా నకిరేకల్ పట్టణంలో హోలీ వేడుకల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం పోటీ పోటీగా హోలీ సంబరాలను నిర్వహించడం వివాదస్పదమయింది. హోలీ సంబరాలు నిర్వహించకుండా మమ్మల్ని అడ్డుకుంటున్నారని వేముల వీరేశం వర్గీయులు ఆందోళన చేపట్టారు. ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య వర్గానికి రెండు డీజేలకు పర్మిషన్ ఇచ్చి మా వర్గానికి డీజే పర్మిషన్ ఇవ్వకుండా పోలీసులు వివక్ష చూపుతున్నారని వేముల వీరేశం వర్గీయులు ఆరోపిస్తున్నారు. నకిరేకల్ సెంటర్‌కు ఇరు వర్గీయులు చేరుకుని బల ప్రదర్శనకు దిగారు. హోరాహోరీగా నినాదాలు చేశారు.

Tags

Read MoreRead Less
Next Story