Telangana: ఎంపీ కోమటిరెడ్డిపై కేసు

X
By - Subba Reddy |7 March 2023 12:45 PM IST
వెంకటరెడ్డి ఆడియో ఎపిసోడ్ కాక ఇంకా కొనసాగుతూనే ఉంది
తెలంగాణ కాంగ్రెస్‌లో సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆడియో ఎపిసోడ్ కాక ఇంకా కొనసాగుతూనే ఉంది. దీనిపై నల్గొండ వన్‌టౌన్ పీఎస్‌లో ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డిపై కేసు నమోదు అయింది. ఐపీసీ 506 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. అలాగే జిల్లా ఎస్పీని కలసి కూడా ఫిర్యాదు చేశారు చెరుకు సుధాకర్ అనుచరులు. ఏకంగా పార్టీ ఉపాధ్యక్షుడిని చంపుతామంటూ వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యల ఆడియో వైరల్ అయింది. కోమటిరెడ్డి వ్యాఖ్యలను ఆయన సొంత జిల్లా నేతలే ఖండిస్తున్నారు. పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే పీసీసీకి, ఏఐసీసీకి ఫిర్యాదులు చేశారు. అయితే వెంకటరెడ్డి మాత్రం ఆ వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకంగా చేయలేదని సమర్థించుకున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com