Telangana: ముగిసిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక

హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నిక పూర్తైంది. సోమవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఎన్నికకు 90శాతానికి పైగా ఓట్లు నమోదయ్యాయి. 29720 మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం 8జిల్లాల్లో పోలింగ్ నిర్వహించారు. 739 మంది సిబ్బందితో 137 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికను నిర్వహించారు. ఈ ఎన్నికలో 21 మంది అభ్యర్థులు నిలుచున్నారు. ప్రధానంగా చెన్నకేశవరెడ్డి, ప్రస్థుత ఎమ్మెల్సీ కాటెపల్లి జనార్ధన్‌రెడ్డి, బీజేపీ బలపర్చిన ఏవీఎన్‌రెడ్డి, కాంగ్రెస్ నుంచి హర్షవర్ధన్ రెడ్డి, మానిక్‌రెడ్డి ఈ ఐదుగురు అభ్యర్థుల మధ్య ప్రధానమైన పోటి ఉంది. కాగా బ్యాలెట్‌బాక్సులను సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలోని స్ట్రాంగ్ రూంకు అధికారులు తరలించనున్నారు. మార్చ్ 16న స్టేడియంలోనే కౌంటింగ్ చేయనున్నారు. ఈ ఎన్నిక ఫలితం పట్ల అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com