Telangana: రానున్న మూడు రోజుల్లో వర్షాలు

Telangana: రానున్న మూడు రోజుల్లో వర్షాలు
X
ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు, వడగళ్ళతో కూడిన వర్షాలు 15,16,17 తేదీల్లో పడనున్నాయి

రానున్న మూడు రోజుల్లో తెలంగాణలో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. 15,16,17 తేదీల్లో పలు చోట్ల వర్షాలు పడనున్నట్లు తెలిపింది. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు, వడగండ్లతో కూడిన వర్షాలు కురుస్తాయని అధికారులు సూచిస్తున్నారు. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించారు. రాష్ట్రంలోని 18 జిల్లాల్లో వర్షం ప్రభావం ఎక్కువున్నట్లు ఎల్లో అలెర్ట్‌ ప్రకటించారు. ఆదిలాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, మంచిర్యాల, కామారెడ్డి, సిరిసిల్ల, మెదక్‌, పెద్దపల్లి, భూపాలపల్లి, సంగారెడ్డి, వికారాబాద్‌, వరంగల్‌, మన్మకొండ, మహబూబాబాద్‌, కొత్తగూడెం, నల్గొండ, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో తుఫాను ప్రభావం ఎక్కువుండనుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.

Tags

Next Story