Telangana: రాష్ట్రంలో పలు చోట్ల వడగళ్ల వాన

Telangana: రాష్ట్రంలో పలు చోట్ల వడగళ్ల వాన
X
ఒక్కసారిగా చల్లబడ్డ వాతావరణం

హైదరాబాద్‌లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. ఉరుములు మెరుపులతో కూడిన వాన పడుతుంది, ఎల్బీనగర్‌, నాగోల్‌, వనస్థలిపురం, లంగర్‌హౌజ్‌, రాజేంద్రనగర్‌, అత్తాపూర్‌, ఆరాంఘర్‌లో వర్షం.రాష్ట్రవ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సంగారెడ్డి, వికారాబాద్‌, జహీరాబాద్‌, లో వడగళ్ల వాన దంచికొడుతోంది. పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం జోరుగా పడుతోంది. తెలంగాణలో మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు.

Tags

Next Story