Telangana: టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏవీఎన్ రెడ్డి గెలుపు
బీఆర్‌ఎస్ మద్దతు తెలిపిన పీఆర్టీయూటిఎస్ అభ్యర్థి చెన్నకేశవ రెడ్డిపై విజయం

తెలంగాణ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన ఏవీఎన్ రెడ్డి గెలుపొందారు. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏవీఎన్ భారీ మెజారీటీతో విజయం సాధించారు. సుమారు 1400 ఓట్ల తేడాతో పీఆర్‌టీయూటిఎస్ అభ్యర్థి చెన్నకేశవరెడ్డిపై గెలిచారు. సరూర్‌నగర్ స్టేడియంలో జరిగిన కౌంటింగ్‌లో ఎవరికీ కావాల్సిన ఆధిక్యం దక్కకపోవడంతో ఎలిమినేషన్ పద్ధతిలో రెండవ ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు. మూడవ స్థానంలో ఉన్న మాణిక్‌రెడ్డికి వచ్చిన 6079 ఓట్లను రెండో ప్రాధాన్యత ఆధారంగా మొదటి రెండు స్థానాల్లో ఉన్న అభ్యర్థులకు సర్దుబాటు చేయడంతో ఏవీఎన్ రెడ్డి గెలుపొందారు. కాంగ్రెస్‌పార్టీ బలపరిచిన హర్షవర్ధన్ రెడ్డి నాలుగవ రౌండ్‌లోనే నిష్క్రమించారు. ఈ ఎన్నికల్లో పూర్తిగా 29720 ఓట్లకు గాను 25868 ఓట్లు పోలయ్యాయి. ఇందులో 452 ఓట్లు చెల్లలేదని అధికారులు వెల్లడించారు.