Telangana: రానున్న నాలుగు రోజులు వర్షాలు

Telangana: రానున్న నాలుగు రోజులు వర్షాలు
X
ఉరుములు, మెరుపులు, వడగళ్లతో కూడిన వర్షం పడే అవకాశాలు

తెలంగాణలో నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలోని పలు జిల్లాలకు వర్షం ముప్పు ఉందని అధికారులు వెల్లడించారు. ఒకటి రెండు రోజుల్లోనే ఉరుములు, మెరుపులు, వడగళ్లతో కూడిన వర్షం పడే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించింది. వర్షాల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఇక ఇటీవల కురిసిన అకాల వర్షాలకు పలు చోట్ల తీవ్రంగా పంట నష్టం జరిగింది. మరోమారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలతో.. రైతుల్లో ఆందోళన మొదలయ్యింది.

Tags

Next Story