Telangana: ఇది మా ఎంపీ అర్వింద్ తెచ్చిన పసుపు బోర్డు..!!

Telangana: ఇది మా ఎంపీ అర్వింద్ తెచ్చిన పసుపు బోర్డు..!!
అర్వింద్‌ పార్లమెంట్‌ ఎన్నికల్లో గెలిచిన తర్వాత హామీ గాలికి వదిలేశారని.. నిజామాబాద్‌ రైతులు ఆగ్రహం

నిజామాబాద్‌ జిల్లాకు కేంద్రం పసుపు బోర్డు ప్రకటించకపోవడంతో.. గుర్తుతెలియని వ్యక్తులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఇది మా ఎంపీ గారు తెచ్చిన పసుపు బోర్డు అంటూ.. నిజామాబాద్‌, ఆర్మూర్‌, బోధన్‌, బాల్కొండలోని కూడళ్లలో పసుపు రంగు ఫ్లెక్సీలను వెలిసాయి. పార్లమెంట్‌ ఎన్నికల సమయంలో.. గెలిచిన తర్వాత ఐదు రోజుల్లో పసుపు బోర్డు తెస్తానని ఎంపీ అర్వింద్‌ బాండ్‌ పేపర్‌ రాసిచ్చారు. మరోవైపు పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి రాజ్నాథ్‌ సింగ్‌, రామ్‌ మాధవ్‌ కూడా హామీ ఇచ్చారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో గెలిచిన తర్వాత హామీ గాలికి వదిలేశారని.. నిజామాబాద్‌ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందుకు నిరసనగా జిల్లా వ్యాప్తంగా ఇదీ మా ఎంపీ తెచ్చిన పసుపు బోర్డు అంటూ రైతులు ఫ్లెక్సీలు కట్టారు. తమను ఎంపీ మోసం చేశాడని మండిపడుతున్నారు.

Tags

Next Story