Telangana : "పేపర్ లీకేజీ కప్పిపుచ్చుకోవడానికే బండి సంజయ్ అరెస్ట్"

Telangana : పేపర్ లీకేజీ కప్పిపుచ్చుకోవడానికే బండి సంజయ్ అరెస్ట్
పేపర్ లీకేజీ వ్యవహారంలో ప్రభుత్వ అసమర్థతను కప్పి పుచ్చుకోవడానికి బండి సంజయ్‌ను అరెస్ట్ చేశారని ఆరోపించారు

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ దుర్మార్గమన్నారు ఆ పార్టీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. ఒక ఎంపీని అకారణంగా అరెస్ట్ చేయడం ప్రభుత్వ పైశాచికత్వానికి నిదర్శనమన్నారు. కేసీఆర్ చెప్పినట్లు పోలీసులు వెన్నెముక లేకుండా వ్యవహరిస్తున్నారన్న ఈటల.. పేపర్ లీకేజీ వ్యవహారంలో ప్రభుత్వ అసమర్థతను కప్పి పుచ్చుకోవడానికి బండి సంజయ్‌ను అరెస్ట్ చేశారని ఆరోపించారు. తక్షణమే బండి సంజయ్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అరెస్ట్‌ను గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్రంగా ఖండించారు. బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్, కేటీఆర్‌కు వ్యతిరేకంగా మాట్లాడితే అరెస్ట్ చేస్తారా అని ప్రశ్నించారు. ఏ కేసులో అరెస్ట్‌ చేశారో చెప్పకుండా సంజయ్‌ను అరెస్ట్ చేయడం దారుణమన్నారు రాజా సింగ్.

పోలీసులు ఇంట్లోకి చొరబడి బండి సంజయ్‌ను అరెస్ట్ చేయడాన్ని బీజేపీ సీనియర్ నేత డీకే అరుణ తప్పుపట్టారు. బీఆర్ఎస్ పార్టీకి కాలం చెల్లిందన్న ఆమె.. ప్రజలు త్వరలోనే ఆ పార్టీని బొందపెడతారని అన్నారు. ఓ జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, పార్లమెంట్ సభ్యుడని లేకుండా అకారణంగా, అక్రమంగా అరెస్ట్ చేయడం సిగ్గుమాలిన చర్యగా అభివర్ణించారు. బండి సంజయ్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

Tags

Next Story