Telangana : వైభవంగా హనుమాన్‌ శోభాయాత్ర

Telangana : వైభవంగా హనుమాన్‌ శోభాయాత్ర
X
చంపాపేట్‌, మలక్‌పేట్‌, సరూర్‌నగర్‌ , కొత్తపేట్‌, దిల్‌సుఖ్‌నగర్‌, కోఠి, కాచిగూడ , ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌ మీదుగా తాడ్‌బండ్‌ వీరాంజనేయస్వామి ఆలయానికి చేరుకుంటుంది

హైదరాబాద్‌లో వైభవంగా హనుమాన్‌ శోభయాత్ర కొనసాగుతోంది. కర్మన్‌ఘాట్‌ హనుమాన్‌ ఆలయం వద్ద నుంచి ర్యాలీ ప్రారంభమైంది. చంపాపేట్‌ క్రాస్‌రోడ్స్‌, మలక్‌పేట్‌, సరూర్‌నగర్‌ , కొత్తపేట్‌, దిల్‌సుఖ్‌నగర్‌, కోఠి, కాచిగూడ క్రాస్‌రోడ్స్‌, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌ మీదుగా తాడ్‌బండ్‌ వీరాంజనేయస్వామి ఆలయానికి చేరుకుంటుంది. అటు గౌలిగూడ నుంచి తాడ్‌బండ్‌ వరకు 12 కిలోమీటర్ల వరకు శోభాయాత్ర సాగుతుంది. శోభాయత్రలో... హనుమాన్‌భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. హనుమాన్ శోభాయాత్రకు 10 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. 850 కెమెరాలతో పోలీసుల నిఘా పెట్టారు. శోభాయాత్ర సందర్భంగా పలుచోట్ల ట్రాఫిక్‌ డైవర్షన్స్ కూడా ఏర్పాటు చేశారు. ర్యాలీ సాఫీగా సాగేందుకు అన్ని చర్యలు తీసుకున్నారు.

Tags

Next Story