Telangana : రాష్ట్రానికి ప్రధాని మోదీ

Telangana : రాష్ట్రానికి ప్రధాని మోదీ
X

రేపు తెలంగాణకు ప్రధాని మోదీ వస్తుండటంతో బీజేపీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి. సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో శనివారం జరుగనున్న బహిరంగ సభకు నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. పరేడ్‌ గ్రౌండ్‌ నుంచి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు ప్రధాని మోదీ. బహిరంగ సభలో అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రసంగిస్తారు. భారీ జన సమీకరణకు ప్లాన్‌ చేస్తున్నారు బీజేపీ నేతలు.


బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి నేరుగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వెళ్లనున్నారు. స్టేషన్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాల అనంతరం పరేడ్ గ్రౌండ్‌లో బహిరంగ సభలో పాల్గొంటారు. ప్రధాని టూర్ నేపథ్యంలో కాన్వాయ్ ట్రైల్ రన్ నిర్వహించారు అధికారులు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి పరేడ్ గ్రౌండ్ వరకు కాన్వాయ్ ట్రయల్ రన్ కొనసాగింది. కాన్వాయ్ వెళ్తున్న సమయంలో ఎలాంటి సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. రోడ్డుకు ఇరువైపుల ప్రత్యేక బలగాలను మోహరించారు.

Next Story