Telangana : వందేభారత్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ

Telangana : వందేభారత్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ
రైలు వారానికి ఆరు రోజులు ప్రయాణించనుంది. ఏప్రిల్ 9వ తేదీనుంచి ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది.

వందేభారత్ రైలును ప్రారంభించారు ప్రధాని మోదీ. హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయంలో దిగిన ప్రధానమంత్రికి గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, బీజేపీ నాయకులు స్వాగతం పలికారు. ఎయిర్ పోర్ట్ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు చేరుకున్న ప్రధాని, వందే భారత్ రైలును జెండా ఊపి ప్రారంభించారు. ఈ రైలు సికింద్రాబాద్ - తిరుపతి మధ్య ప్రయాణించనుంది. ఇందులో 530 మంది ప్రయాణించేందుకు వీలుగా సీట్లు అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలిపారు. ఈ రైలు వారానికి ఆరు రోజులు ప్రయాణించనుంది. ఏప్రిల్ 9వ తేదీనుంచి రైలు ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది.

తెలంగాణకు బయలుదేరే ముందు ప్రధాని ట్వీట్ చేశారు. "హైదరాబాద్ కు బయలుదేరి అక్కడ సికింద్రాబాద్- తిరుపతి మధ్య వందేభారత్ ఎక్స్ ప్రెస్ ను ప్రారంభించి, ఇతర అభివృద్ధి పనులను ప్రారంభించడం లేదా వాటి శంకుస్థాపనలు చేయడం జరుతుంది" అని ట్వీట్ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story