Telangana : ముగిసిన ప్రధాని మోదీ పర్యటన

Telangana : ముగిసిన ప్రధాని మోదీ పర్యటన
X
పనిచేసే మా లాంటి వారితో..కుటుంబ, అవినీతిపాలన చేసే వారికి ఇబ్బందున్నాయ్ అని సెటైర్‌ వేశారు

ప్రధాని మోదీ హైదరాబాద్‌ పర్యటన ముగిసింది. కేసీఆర్ సర్కార్‌పై ప్రధాని మోదీ అటాక్‌ చేశారు. పనిచేసే మా లాంటి వారితో..కుటుంబ, అవినీతిపాలన చేసే వారికి ఇబ్బందున్నాయ్ అని సెటైర్‌ వేశారు.కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం సహకరించడం లేదన్న మోదీ. కుటుంబ పాలకులు ప్రతీ వ్యవస్థను కంట్రోల్చేయాలనుకుంటున్నారని అన్నారు.ప్రజలంతా ఆ పరివారానికే జేజేలు కొట్టాలని వారు అనుకుంటున్నారుని,కుటుంబ పాలనను అంతమొందించాల్సిన అవసరం ఉందా లేదా? అంటూ ప్రశ్నించారు. తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోతున్నాయని,రాష్ట్ర ప్రభుత్వ పనితీరు పట్ల తెలంగాణ ప్రజలు సంతృప్తిగా లేరన్నారు.

అంతకుముందు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకాం చుట్టారు.ఢిల్లీ నుంచి పదకొండున్నరకు బేగంపేట విమానశ్రయానికి చేరుకున్నారు.ఆయనకు తెలంగాణ ప్రభుత్వం తరుపున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వాగతం పలికారు. గవర్నర్ తమిళిసై, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ స్టేట్ చీఫ్ బండిసంజయ్ కుమార్ తదితరులు మోడీకి ఘనస్వాగతం పలికారు. బేగంపేట్ విమానశ్రయం నుంచి నేరుగా మోడీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు చేరుకున్న ప్రధాని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. తన రెండు గంటలసేపు నగరంలో పర్యటించనున్న ప్రధాని దాదాపు 11 వేల కోట్ల విలువైన పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.715 కోట్లతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఆధునీకరణ పనులకు భూమి పూజ చేశారు.

అక్కడ నుంచి సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానంలో నిర్వహించిన బహిరంగసభ వేదిక నుంచే వర్చువల్‌ గా 1,410 కోట్లతో పూర్తి చేసిన సికింద్రాబాద్–మహబూబ్ నగర్ డబ్లింగ్ లైన్​ను జాతికి అంకితం చేశారు. ఎంఎంటీఎస్ ఫేజ్ 2లో భాగంగా 13 కొత్త సర్వీసులను ప్రారంభించారు. అలాగే 7వేల864 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న 6 లైన్ల జాతీయ రహదారి ప్రాజెక్టులకు భూమిపూజ చేశారు. అలాగే బీబీనగర్ ఎయిమ్స్​లో చేపట్టనున్న వివిధ పనులకు భూమి పూజ చేశారు. అనంతరం అభివృద్ధి పనులు, వాటి ప్రయోజనాలకు సంబంధించిన షార్ట్ ఫిల్మ్​ను ప్రధాని తిలకించారు.

ప్రధాని కార్యక్రమంలో రైల్వేశాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్‌, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. పరేడ్​ గ్రౌండ్స్ లో​సభ ముగిశాక నుంచి నేరుగా బేగంపేట్ ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లారు ప్రధాని మోదీ.

Tags

Next Story