Telangana: పదవులు అనుభవించి.. ఇప్పుడు విమర్శిస్తారా?: మంత్రి నిరంజన్

బీఆర్‌ఎస్ నుంచి జూపల్లి, పొంగులేటి సస్పెన్షన్ వ్యవహారం ఆ పార్టీలు హీట్ పుట్టిస్తోంది. సస్పెన్షన్‌కు గురైన వెంటనే.. జూపల్లి, పొంగులేటి కేసీఆర్, కేటీఆర్ టార్గెట్‌గా పదునైన విమర్శలు గుప్పిస్తున్నారు. ఐతే.. పార్టీలో పదవులు అనుభవించి.. ఇప్పుడు విమర్శలు చేస్తారా అంటూ.. మంత్రి నిరంజన్ రెడ్డి ఎదురుదాడికి దిగారు. వీరి వ్యవహార శైలి మారకపోవడంతోనే వేటు వేసినట్లు స్పష్టం చేశారు. అటు.. కొత్తగూడెం మీటింగ్‌లో కేసీఆర్‌పై ఇద్దరు నేతల విమర్శలతో ముసలం పుట్టింది. జూపల్లి, పొంగులేటి వ్యవహార శైలిని సీరియస్‌గా తీసుకున్న కేసీఆర్… ఆ ఇద్దరిపై వేటుకు ఆదేశించడం.. పార్టీ నుంచి బయటకు పంపడం వెంటవెంటనే జరిగిపోయాయి.
కొంత కాలంగా జిల్లా వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో పొంగులేటి ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నారు. తాజా రాజకీయ పరిస్థితుల్లో కాంగ్రెస్సా, బీజేపీనా.. ఏ పార్టీలో చేరాలనేదానిపై ఆయన డైలమాలో ఉన్నారు. సొంతంగా కొందరు ఉద్యమకారులతో పార్టీ పెట్టే ఆలోచన కూడా చేస్తున్నారు. సొంత పార్టీనా.. ఇతర పార్టీలో చేరాలా.. అనే విషయంపై త్వరలోనే క్లారిటీ ఇస్తానంటున్నారు పొంగులేటి. తనను నష్టపర్చిన వారిని దెబ్బతీయడమే మొదటి లక్ష్యంగా ఆయన చెబుతున్నారు. ఈ నేపథ్యంలో.. ఖమ్మం, మహబూబ్ నగర్‌లో బహిష్కృత నేతలు బీఆర్ఎస్‌కు నష్టం కల్గిస్తారా? అనే అనుమానాలున్నాయి, ఐతే.. పొంగులేటి, జూపల్లితో పోయేదేం లేదని బీఆర్‌ఎస్ వర్గాలు కొట్టిపారేస్తున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com