Telangana: కసాయి తండ్రి ఘాతుకానికి కుమార్తె బలి

జనగామ జిల్లాలో దారుణం జరిగింది. కన్న కూతుర్లకు విషమిచ్చి చంపేందుకు యత్నించిన ఘటనలో చికిత్స పొందుతూ పెద్ద కుమార్తె ప్రాణాలు కోల్పోయింది. పాలకుర్తి మండలంలోని జానకీపురం గ్రామానికి చెందిన శ్రీను ఈ నెల 6వ తేదీన కూల్ డ్రింక్‌లో విషం కలిపి తన కుమార్తెలకు ఇచ్చాడు. చిన్నారులకు వాంతులు కావడం గమనించిన తల్లి ధనలక్ష్మి, బంధువులు వారిద్దరిని జనగామ ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎంకు తరలించారు.
అయితే ఎంజీఎంలో చికిత్స పొందుతూ పెద్ద కుమార్తె ప్రియ ప్రాణాలు కోల్పోయింది. ప్రస్తుతం హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్న కుమార్తె నందిని ఆరోగ్య పరిస్థితి సైతం విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కుటుంబ కలహాల కారణంగానే శ్రీను చిన్నారులకు విషమిచ్చినట్లు తెలుస్తోంది. నిందితుడి భార్య ధనలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదుతో శ్రీనుని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com