Telangana: నేడు అనుచరులతో జూపల్లి సమావేశం

మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఇవాళ (మంగళవారం) తన అనుచరులతో కొల్లాపూర్లో సమావేశం కానున్నారు. బీఆర్ఎస్ నాయకత్వం ఆయనపై సస్పెన్షన్ వేటు వేయడంతో భవిష్యత్తు కార్యాచరణపై చర్చించనున్నారు. ఆయన ఏ పార్టీలో వెళ్లాలన్నదానిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. జూపల్లి కృష్ణారావు 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేసి ఓడిపోయారు. కాంగ్రెస్ అభ్యర్ధిగా గెలిచిన బీరం హర్షవర్ధన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరడంతో రాజకీయ పరిణామాలు మారాయి. హర్షవర్ధన్ రెడ్డి , జూపల్లి కృష్ణారావు వర్గాల మధ్య పొసగలేదు. ఇరువర్గాల మధ్య సఖ్యత కోసం పార్టీ నాయకత్వం ప్రయత్నించింది. కానీ వారి మధ్య గ్యాప్ పెరుగుతూనే వచ్చింది. నియోజకవర్గ అభివృద్దిపై ఇద్దరు నేతలు సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురకున్నారు. దీంతో కొల్లాపూర్ లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇస్తానంటూ.. కేసీఆర్ చేసిన ప్రకటన.. జూపల్లిలో అంసతృప్తిని పెంచింది. దీంతో అప్పటి నుంచి పార్టీకి అంటీ ముటనట్లు ఉన్నారు. ఇప్పుడు ఆయన్ను సస్పెండ్ చేయడంతో.. తన భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com