Telangana: ఎంసెట్‌ పరీక్షలు షురూ

Telangana: ఎంసెట్‌ పరీక్షలు షురూ
X
నేటి నుంచి తెలంగాణ ఎంసెట్‌ పరీక్షలు జరగనున్నాయి. ఇవాళ తొలిరోజు అగ్రికల్చర్‌ విభాగం రెండు విడతల పరీక్షలకు

నేటి నుంచి తెలంగాణ ఎంసెట్‌ పరీక్షలు జరగనున్నాయి. ఇవాళ తొలిరోజు అగ్రికల్చర్‌ విభాగం రెండు విడతల పరీక్షలకు తెలంగాణ, ఏపీల నుంచి మొత్తం 57 వేల 577 మంది హాజరుకానున్నారు. ఉదయం విడతలో తెలంగాణ నుంచి 23 వేల 486 మంది, ఏపీ నుంచి 5 వేల 199 మంది రాయనున్నారు. మధ్యాహ్నం విడతలో తెలంగాణ నుంచి 23 వేల 691 మంది, ఏపీ నుంచి 5 వేల 201 మందికి స్లాట్లు కేటాయించామని ఎంసెట్‌ కో కన్వీనర్‌ ఆచార్య కె.విజయకుమార్‌రెడ్డి తెలిపారు. అగ్రికల్చర్‌కు తెలంగాణలో 95, ఏపీలో 18 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు.

Tags

Next Story