Telangana: ఆవిర్భావ వేడుకలకు భారీప్లాన్‌

Telangana: ఆవిర్భావ వేడుకలకు భారీప్లాన్‌
తెలంగాణ రాష్ట్ర దశాబ్ధి ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2014 జూన్‌ 2న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించింది

తెలంగాణ రాష్ట్ర దశాబ్ధి ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2014 జూన్‌ 2న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించింది. మరి కొద్ది రోజుల్లో పదో సంవత్సంలోకి అడుగు పెట్టబోతుంది. దీన్ని పురష్కరించుకుని, పది రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా, వివిధ కార్యక్రమాలు ప్రతిష్టాత్మకంగా, నిర్వహించాలని ప్రణాళికలు రూపొందించింది ప్రభుత్వం. రాష్ట్ర ఆవిర్బావం నుండి ఇప్పటి వరకూ జరిగిన ప్రగతిపై, విసృతంగా ప్రచార కార్యక్రమాల నిర్వహణకు రంగం సిద్ధం చేసింది.

ముఖ్యంగా దేశానికి తెలంగాణ రోల్ మోడల్ అని, అభివృద్ధి, సంక్షేమ పథకాలు అవసరం ఉందనేది, బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి, అవసరం అయిన ప్రణాళికలు రూపొందించారు. రాష్ట్ర స్థాయిలోనే కాకుండా, జిల్లా, మండల స్థాయిల్లోనూ దశాబ్ధి వేడుకలు నిర్వహణకు ప్రతిపాదనలు సిద్ధం చేసారు. సీఎం కేసీఆర్‌ మార్గనిర్ధేశం, ఆదేశాలు, సూచనలు మేరకు, తుది కార్యాచరణ రూపొందించనున్నట్లు అధికారులు తెలిపారు.

మరో ఆరు నెలల్లో ఎన్నికలు రానుండడం, ఇదే ఏడాది ప్రత్యేక రాష్ట్రం అవతరించి, పదో సంవత్సరంలోక అడుగు పెట్టడం... ఈ రెండింటినీ దృష్టిలో పెట్టుకుని రూపకల్పన చేసినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా నీళ్లు, నిధులు, నియామకాలు అనే ఆకాంక్షలతో ఏర్పాటైన తెలంగాణలో... ఈ మూడు అంశాల్లో ఇప్పటి వరకూ సాధించిన అభివృద్ధిని క్షేత్రస్థాయిలో, అన్ని వర్గాల ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సంకల్పించారు. కాళేశ్వరం, మిషన్‌ భగీరథ, సహా పలు ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల నిర్మాణం, 24గంటల కరెంటు, హైదరాబాద్‌ అంతర్జాతీయ గుర్తింపును సాధించడం, దిగ్గజ ఐటీ సంస్ధలు హైదరాబాద్‌లో కొలువుదీరడం, ప్రధాన ప్రచారాంశాలుగా పేర్కొనాలని నిర్ణయించారు.

Tags

Read MoreRead Less
Next Story