Telangana: 10వ తరగతి పేపర్‌ లీక్‌..వాట్సాప్‌ గ్రూప్‌లో చక్కర్లు

Telangana: 10వ తరగతి పేపర్‌ లీక్‌..వాట్సాప్‌ గ్రూప్‌లో చక్కర్లు
X
తెలంగాణలో సంచలనం రేపుతున్న పేపర్‌ లీకేజీ ఘటనలు

తెలంగాణలో పేపర్‌ లీకేజీ ఘటనలు సంచలనం రేపుతున్నాయి. పదో తరగతి పరీక్షలు ప్రారంభమైన కాసేపటికే పేపర్‌ వాట్సాప్‌ గ్రూప్‌లో చక్కర్లు కొట్టడం కలకలం రేపింది. ఈ ఘటన వికారాబాద్‌ జిల్లా తాండూర్‌లో చోటుచేసుకుంది. ఉదయం 9 గంటల 37 నిమిషాలకు తెలుగు పేపర్‌ లీకైందన్న ఆరోపణలు వచ్చాయి. అది వాట్సాప్‌లో తిరగడంతో అధికారులు, పోలీసులు ఖంగుతిన్నారు. అధికారులు విచారణ చేపట్టారు. ప్రశ్నాపత్రం కలకలం రేపడంతో పదో తరగతి విద్యార్థులు.. వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Tags

Next Story