Telangana: విద్యుత్ ఉద్యోగులకు 12 శాతం ఫిట్‌మెంట్

తెలంగాణలో విద్యుత్ ఉద్యోగులకు 12 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాలని కరెంటు సంస్థలు సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మొదట 6 శాతమే ఇస్తామని చెప్పిన యాజమాన్యాలు, అంతిమంగా 12 శాతం ఉంటుందని సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం. 2020 ఏప్రిల్ ఒకటి నుంచి నుంచి వేతన సవరణ చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ నేతృత్వంలో దశలవారీగా ఆందోళనలు చేస్తున్నారు. ఇందులో భాగంగా యాజమాన్యాలు, విద్యుత్‌శాఖ మంత్రితో చర్చలు జరిపాయి. ముందుగా 6శాతం ఫిట్‌మెంట్‌నే మాత్రమే ఇస్తామని విద్యుత్ సంస్థలు స్పష్టం చేశాయి. ఆ తర్వాత యాజమాన్యాలు మంత్రికి పరిస్థితిని వివరించాయి. ఈ అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లి నిర్ణయం తీసుకెళ్తామని ఉద్యమాలను వాయిదా వేసుకోవాలన్నారు.రేపు మరోసారి సమావేశం కానున్నారు.
విద్యుత్ ఉద్యోగులకు వర్తింపచేసే ఫిట్‌మెంట్ ఆధారంగానే ప్రభుత్వ ఉద్యోగులకు ఫిట్‌మెంట్‌పై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తోంది. ఇప్పటికే జీతాల కోసం దాదాపు ఎనిమిదన్నర వేల కోట్లు అవుతోంది. ఇప్పుడు 12 శాతం ఇస్తే మరో వెయ్యి కోట్లు అదనపు భారం పడుతుందుందని అంచనా. వర్క్‌మెన్, నాన్‌వర్క్‌మెన్లకు వేర్వేరు స్కేళ్లు ఉండగా.. సింగిల్ మాస్టర్ స్కేలు వర్తింపచేయడానికి యాజమాన్యాలు ప్రాథమికంగా అంగీకారం తెలిపాయి. అంతేకాకుండా ఆర్టిజన్లకు పర్సనల్ పేను ప్రత్యేకంగా ఇస్తుండగా.. దాన్ని బేసిక్ పేలో కలపడానికి అంగీకారం కుదిరింది. దీంతో పాటు జీపీఎఫ్‌లో చేర్చాలనే డిమాండ్‌పై అధ్యయనానికి కమిటీ వేయాలని నిర్ణయించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com