Telangana: ఎమ్మెల్యేల ఎర కేసు..ఈ నెల 27కు వాయిదా

Telangana: ఎమ్మెల్యేల ఎర కేసు..ఈ నెల 27కు వాయిదా
విచారణ పూర్తయ్యేంతవరకు ఎవరిని అరెస్టు చేయోద్దని సీబీఐకి ఆదేశాలు ఇవ్వాలన్న తెలంగాణ ప్రభుత్వ అభ్యర్థనపైనా సుప్రీం నిరాకరణ

తెలంగాణలో ఎమ్మెల్యేల ఎర కేసు అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. విచారణ పూర్తయ్యేంతవరకు ఎవరిని అరెస్టు చేయోద్దని సీబీఐకి ఆదేశాలు ఇవ్వాలన్న తెలంగాణ ప్రభుత్వ అభ్యర్థనపైనా స్పందించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఐతే సీబీఐని తాము కంట్రోల్ చేయలేమన్న సుప్రీం బెంచ్‌..తదుపరి విచారణ ఈ నెల 27కు వాయిదా వేసింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే వాదనలు వినిపించారు. ఇది చాలా సీరియస్ అంశంగా పేర్కొన్న దవే..నిందితులపై నమోదైన కేసులు చాలా తీవ్రమైనవని వాదనలు వినిపించారు. ఈ వ్యవహారం ప్రజాస్వామ్యానికి నష్టం కలిగిస్తుందన్నారు. కేసు వివరాలను స్వయంగా ముఖ్యమంత్రే పెన్‌డ్రైవ్‌లతో సహా మీడియా అందరికీ పంపారని కోర్టుకు వివరించారు బీజేపీ తరపు న్యాయవాది జెఠ్మలాని.

కేసు వివరాలు స్వయంగా ముఖ్యమంత్రే లీక్ చేశారన్నారు జెఠ్మలాని. కేసుకు సంబంధించి తమ దగ్గర ఐదు గంటల వీడియో, కాల్‌ డేటా, వాట్సాప్ మెస్సెజ్‌లు సహా చాలా ఆధారాలున్నాయని వాదనలు వినిపించారు దవే. కేసును సీబీఐకి ఇవ్వాల్సిన అవసరం ఏముందంటూ వాదించారు. ఈ కేసుకు సంబంధించి తనకు ఎక్కువ సమయం కావాలని..అందుకు కేసు విచారణను వాయిదా వేయాలని తెలంగాణ ప్రభుత్వం తరపు న్యాయవాది దవే కోరినట్లు తెలుస్తోంది. దీంతో ఈ నెల 27న కేసు విచారణ చేపట్టడనున్నట్లు ప్రకటించింది ధర్మాసనం. 27న జాబితాలో అన్ని కేసులు ముగిసిన తర్వాత విచారించనున్నట్లు స్పష్టం చేసింది.

ఎమ్మెల్యేలకు ఎర కేసును గతంలోనే తెలంగాణ హైకోర్టు సీబీఐకి అప్పగించింది. ఐతే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని కోరింది. ఐతే స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. సీబీఐ పత్రాలు ఇవ్వాలంటూ ఒత్తిడి చేస్తోందని..స్టేటస్‌ కో ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాదులు సుప్రీంను కోరారు. ఐతే స్టేటస్‌ కో ఇచ్చేందుకు నిరాకరించిన సుప్రీంకోర్టు..కేసులో మెరిట్స్ ఉంటే రివర్స్ చేస్తూ ఆదేశాలు ఇస్తామని పేర్కొంది.

Tags

Read MoreRead Less
Next Story