Telangana : 28న అమిత్‌ షా తెలంగాణ పర్యటన

Telangana : 28న అమిత్‌ షా తెలంగాణ పర్యటన
X
2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బలహీనమైన నియోజకవర్గాలపై ఫోకస్‌

లోక్‌సభ ప్రవాస్ ప్రచారంలో భాగంగా జనవరి 28న కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణకు రానున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలోని బలహీనమైన నియోజకవర్గాల్లో పనితీరును మెరుగు పరిచేందుకు బీజేపీ ఆఫీస్ బేరర్లతో సమావేశమవుతారని తెలుస్తోంది.


పార్టీ నేతలతో సమావేశమై ఎన్నికల సన్నాహానికి సంబంధించి పార్టీకి మార్గదర్శకాలు ఇవ్వనున్నారని సమాచారం. పర్యటన సందర్భంగా అమిత్ షా 17 లోక్‌సభలు, 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బూత్ కమిటీలు, మండల ఇతర స్థాయి కమిటీల నియామకంపై సమీక్షించనున్నారు. షా పర్యటనకు ముందు రెండు రోజుల పాటు రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రధాని మోడీ బహిరంగ సభలు నిర్వహించనున్నారు.

Tags

Next Story