Telangana: వచ్చే రెండేళ్లలో 3400 ఎలక్ట్రిక్‌ బస్సులు

Telangana: వచ్చే రెండేళ్లలో 3400 ఎలక్ట్రిక్‌ బస్సులు
X
మేఘాకు చెందిన ఒలెక్ట్రా గ్రీన్‌ టెక్‌ లిమిటెడ్‌ కు వెయ్యి కోట్ల విలువైన 550 ఎలక్ట్రిక్‌ బస్సుల అర్డర్‌

వచ్చే రెండేళ్లలో 3400 ఎలక్ట్రిక్‌ బస్సులు అందుబాటులో తీసుకురావాలని తెలంగాణ సర్కారు నిర్ణయించింది. ఇందులో భాగంగా మేఘాకు చెందిన ఒలెక్ట్రా గ్రీన్‌ టెక్‌ లిమిటెడ్‌ కు వెయ్యి కోట్ల విలువైన 550 ఎలక్ట్రిక్‌ బస్సుల అర్డర్‌ ఇచ్చింది. వీటిలో 500 ఇంట్రాసిటీ బస్సులు కాగా.. మిగిలిన 50 ఇంటర్‌ సిటీ ఎయిర్‌ కండిషన్డ్‌ కోచ్‌లు. ఇంటర్‌సిటీ బస్సులను హైదరాబాద్‌-విజయవాడ మధ్య నడపనుంది టీఎస్‌ఆర్టీసీ. ఇక 500 ఇంట్రాసిటీ ఎలక్ట్రిక్‌ బస్సులను GHMC పరిధిలో తిప్పనున్నారు. ఇంట్రాసిటీ బస్సులను ఒక్కసారి చార్జింగ్‌ చేస్తే 225 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణిస్తాయి. ఇక.. ఇంటర్‌సిటీ బస్సులు 325 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తాయని అధికారులు చెబుతున్నారు.

Tags

Next Story