Telangana : ముందస్తు ఎన్నికలకు రెడీ: బండి

Telangana : ముందస్తు ఎన్నికలకు రెడీ: బండి
పంజాబ్ రైతులకు చెల్లని చెక్కులు ఇచ్చి తెలంగాణ పరువు తీశారు


ముందస్తు ఎన్నికలకు తాము సిద్ధమేనని అన్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్. ముందస్తు అంటూ, సీఎం కేసీఆర్ లీకులు ఇస్తున్నారని, దమ్ముంటే ప్రకటించాలని డిమాండ్ చేశారు. పంజాబ్ రైతులకు చెల్లని చెక్కులు ఇచ్చి తెలంగాణ పరువు తీశారని మండిపడ్డారు. ఇతర రాష్ట్రాల నాయకులను రప్పించి బీఆర్ఎస్ లో చేర్చుకునేందుకు అనేక అబద్ధాలు ఆడుతున్నాడని విమర్శించారు. రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ నాలుగోస్థానంలో ఉన్నదని చెప్పారు. తెలంగాణలో 24 గంటల కరెంటు రాని వంద గ్రామాల పేర్లు చెప్తానని, వచ్చే ఐదు గ్రామాల పేర్లు కేసీఆర్‌ చెప్పాలన్నారు. కేసీఆర్ ఇప్పటి వరకు ఎన్ఆర్ఐ పాలసీ తీసుకురాలేదన్నారు. బీజేపీ సిద్దాంతాలు గల పార్టీ అని, పార్టీలో కోవర్టులున్నట్టు ఈటల అనలేదని బండి సంజయ్‌ స్పష్టం చేశారు.

Tags

Next Story