Telangana: రెెవెన్యూ అధికారుల నిర్వాకం

Telangana: రెెవెన్యూ అధికారుల నిర్వాకం
భూ పట్టదారు బతికిండగానే చినపోయినట్లు నకిలీ పత్రాలు; మరో వ్యక్తి పేరున పట్టా మార్పిడి...

మెదక్ జిల్లా తూప్రాన్ లో రెవెన్యూ అధికారుల నిర్వాకం బయటపడింది. భూ పట్టదారు బతికిండగానే చినపోయినట్లు ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి మరో వ్యక్తి పేరున పట్టా మార్పిడి చేశారు. విషయం తెలుసుకున్న బాధితులు ఎమ్మార్వో కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం చేయాలంటూ నిరసనకు దిగారు. తూప్రాన్‌ మండలం వెంకటాయపల్లికి చెందిన మల్లయ్య అనే వ్యక్తిపై 12 గుంటల భూమి ఉంది. అయితే నకిలీ పత్రాలు సృష్టించిన యాదయ్య అనే వ్యక్తి పేరుపైకి అధికారులు పట్టా మార్పిడి చేశారు. ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో రెవెన్యూ అధికారుల తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాసులకు కక్కుర్తి పడి తమ భూమిని రెవెన్యూ అధికారులు వేరే వ్యక్తి పేరున మార్పిడి చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story