Telangana: తెలంగాణలో బీజేపీ త్రిముఖ వ్యూహం

తెలంగాణపై బీజేపీ శ్రద్ధ పెంచింది. ఇక్కడ అధికారం దక్కించుకోవాలనే పట్టుదలతో ఆ పార్టీ ప్రత్యేక వ్యూహాలు రచిస్తోంది. ఈ నెలలోనే బీజేపీ అగ్రనేతలు రాష్ట్రానికి రానున్నారు. యూపీలో సక్సెస్ మంత్రంలా పనిచేసిన త్రిముఖ వ్యూహాన్ని తెలంగాణలో కూడా అమలు చేయాలని బీజేపీ నిర్ణయించింది. ఇందుకోసం పోలింగ్ బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు వివిధ దశల్లో సమావేశాలు, భారీ బహిరంగసభలకు ప్లాన్ చేస్తోంది.
ఈ నెల 11న అమిత్ షా, ఆ తర్వాత కొద్ది రోజులకే ప్రధాని మోదీ కూడా తెలంగాణకు రానున్నారు. ఆదిలాబాద్, పెద్దపల్లి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అమిత్ షా పర్యటిస్తారు. ఇక నెలాఖరుకు బీజేపీ అధ్యక్షుడు జె.పి.నడ్డా రాష్ట్రానికి వస్తారని పార్టీ ముఖ్యనేతలు తెలిపారు. తొలుత ఫిబ్రవరి 13న ప్రధాని తెలంగాణకు వస్తారని ప్రచారం జరిగింది. అయితే ఇంకా పూర్తి స్థాయిలో షెడ్యూల్ కన్‌ఫమ్ కాలేదు.
కేంద్రం ఆయా ప్రాంతాలకు ఎన్ని నిధులు ఇచ్చింది? ఆ నిధులు ఏమయ్యాయి? బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆ ప్రాంతానికి ఇచ్చిన హామీలేంటి? వైఫల్యాలేంటి? వంటి అంశాలను బీజేపీ ప్రచారం చేయాలని భావిస్తోంది. ఇందుకోసం భారీ బహిరంగసభలను నిర్వహించనుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com