Telangana : హెచ్ఎండిఏ ప్లాట్లను ఆన్‌లైన్ పద్ధతిలో వేలం

Telangana : హెచ్ఎండిఏ ప్లాట్లను ఆన్‌లైన్ పద్ధతిలో వేలం
నగర శివారు ప్రాంతాల్లో ఉన్న ల్యాండ్ పార్సిల్స్.. ప్లాట్లను మార్కెట్ రేటుపై ప్రజానీకానికి అందుబాటులోకి తీసుకొస్తోంది

ప్రభుత్వ స్థలాలు అన్యాక్రాంతం కాకుండా తెలంగాణ ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టింది. నగర శివారు ప్రాంతాల్లో ఉన్న ల్యాండ్ పార్సిల్స్.. ప్లాట్లను మార్కెట్ రేటుపై ప్రజానీకానికి అందుబాటులోకి తీసుకొస్తోంది. ప్రభుత్వ ఆదేశాలకు మేరకు హెచ్ఎండిఏ ప్లాట్లను పారదర్శకంగా అన్‌లైన్ పద్ధతిలో వేలం ద్వారా అమ్మకానికి పెట్టింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎంఎస్టీసీ వేలం ప్రక్రియను నిర్వహించనుంది.

మధ్యతరగతి ప్రజలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, డెవలపర్లు.. ఈ ల్యాండ్ పార్సిల్స్ కొనుగోలు కోసం ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం అందుబాటులో మూడు జిల్లాల పరిధిలో అవుటర్ రింగ్ రోడ్డుకు దగ్గరలో అమ్మకానికి 39 ల్యాండ్ పార్సెల్స్ ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాలో పది, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఆరు, సంగారెడ్డి జిల్లాలో 23 ల్యాండ్ పార్సిల్స్ సిద్ధంగా ఉన్నాయని హెచ్‌ఎండిఏ తెలిపింది. ఆయా ప్లాట్లను కేఎంఎల్ ఫైల్ ద్వారా కొనుగోలుదారులు చూసుకోవచ్చని వెల్లడించింది. అందుబాటు ధరల్లో 121 గజాల నుంచి 10 వేల 164 గజాల వరకు స్థలాలు ఉన్నాయని హెచ్‌ఎండిఏ అధికారులు ప్రకటించారు.

రంగారెడ్ది జిల్లాలోని గండిపేట మండలంలో 3, శేరిలింగంల్లి మండలంలో 5 ల్యాండ్ పార్సెల్స్ ఉన్నాయి. అలాగే ఇబ్రాహీంపట్నం మండలంలో 2, మల్కాజిగిరి జిల్లాలోని మేడిపల్లి మండలంలో 4, ఘట్ కేసర్ మండలంలో 1, బాచుపల్లి మండలంలో 1 చొప్పున ఉన్నాయి. ఇక సంగారెడ్డి జిల్లాలోని అమీన్ పూర్ మండలం పరిధిలో 16, అర్.సి పురం మండలంలో 6, జిన్నారం మండలంలో ఒకటి చొప్పున ల్యాండ్ పార్సిల్స్ ఉన్నాయి. మార్చి ఒకటిన ఈ మొత్తం 39 ల్యాండ్ పార్సిల్స్‌ను ఎంఎస్టీసీ ఆధ్వర్యంలో ఆన్‌లైన్‌ వేలం ద్వారా విక్రయించడానికి సన్నాహాలు చేస్తోంది హెచ్ఎండీఏ.

Tags

Next Story