Telangana : బీఆర్ఎస్ పై జేపీ నడ్డా ఫైర్

Telangana : బీఆర్ఎస్ పై జేపీ నడ్డా ఫైర్

తెలంగాణ ప్రభుత్వంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ బీఆర్ఎస్‌గా మారింది కానీ తెలంగాణ ఏమాత్రం మారలేదన్నారు. వర్చువల్ పద్దతిలో తెలుగు రాష్ట్రాల్లోని ఆరు జిల్లాల్లో బీజేపీ కార్యాలయాలను ప్రారంభించిన నడ్డా.. కేసీఆర్ మాటలు చెప్పడం తప్పా చేసిందేమీ లేదన్నారు. కేసీఆర్ కుమార్తెను ఈడీ విచారిస్తోందని.. ED విచారణతో కవిత తెలంగాణ పరువు తీసిందన్నారు. BRSకి త్వరలోనే ప్రజలు VRS ఇస్తారని అన్నారు. ఇక రాహుల్ గాంధీ OBCలపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న నడ్డా.. కోర్టు క్షమాపణలు చెప్పమన్న చెప్పలేదన్నారు. అహంకారంతో ఉన్న రాహుల్‌కి ప్రజలే బుద్ధి చెబుతారని నడ్డా హెచ్చరించారు.

Tags

Next Story