Telangana: పెండింగ్‌ బిల్లుల కేసుపై సుప్రీం విచారణ

Telangana: పెండింగ్‌ బిల్లుల కేసుపై సుప్రీం విచారణ
X
ఇందులో భాగంగా తమ దగ్గర ఏ బిల్లులూ పెండింగ్‌లో లేవని గవర్నర్‌ తరపు న్యాయవాది సుప్రీంకు తెలియ జేశారు

తెలంగాణ గవర్నర్‌ పెండింగ్‌ బిల్లుల కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఇందులో భాగంగా తమ దగ్గర ఏ బిల్లులూ పెండింగ్‌లో లేవని గవర్నర్‌ తరపు న్యాయవాది సుప్రీంకు తెలియ జేశారు. రెండు బిల్లుల విషయంలో ప్రభుత్వం నుంచి అదనపు సమాచారం, క్లారిఫికేషన్‌ కోరామని ధర్మాసనానికి తెలియజేశారు. మరోవైపు ఎన్నికైన చట్ట సభల ప్రతినిధులు గవర్నర్ల దయాదాక్షిణ్యాలపై ఆధార పడాల్సిన పరిస్థితి ఉందని కోర్టుకు తెలిపారు ప్రభుత్వ తరపు న్యాయవాది. బిల్లులను పెండింగ్‌లో పెట్టడం సమంజసం కాదన్నారు. వాదనలు, ప్రతివాదనలు విన్న ధర్మాసనం గవర్నర్‌ దగ్గర ఏ బిల్లు పెండింగ్‌లో లేదు కదా అంటూ ప్రశ్నించింది. అయితే గవర్నర్లు నిర్ణీత కాలవ్యవధిలోగా బిల్లులపై నిర్ణయం తీసుకోవాలని ఆర్డర్‌ ఇవ్వాలంటూ సుప్రీంకో ర్టును కోరారు ప్రభుత్వ తరపు న్యాయవాది.

Tags

Next Story