ప్రభుత్వ ఉద్యోగుల వయో పరిమితి పెంపు సవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం

ప్రభుత్వ ఉద్యోగుల వయో పరిమితి పెంపు సవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
X
50వేల ఉద్యోగాల భర్తీకి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని.. త్వరలోనే నోటిఫికేషన్లు విడుదల చేస్తామని హరీష్‌ రావు తెలిపారు.

ప్రభుత్వ ఉద్యోగుల వయో పరిమితి పెంపు సవరణ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా సభకు ధన్యవాదాలు తెలిపిన ఆర్థిక మంత్రి హరీష్‌ రావు.. ఉద్యోగుల అనుభవాన్ని ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. వయసు పెంపుదల వల్ల ఖాళీల భర్తీపై ఎలాంటి ప్రభావం ఉండదని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో 50వేల ఉద్యోగాల భర్తీకి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని.. త్వరలోనే నోటిఫికేషన్లు విడుదల చేస్తామని హరీష్‌ రావు తెలిపారు.


Tags

Next Story