TG: డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా తీర్మానం

లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజనకు వ్యతిరేకంగా అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ‘పునర్విభజనకు జనాభా ఒక్కటే ప్రమాణికం కాదు. రాష్ట్రాన్ని యూనిట్‌గా తీసుకుని నియోజకవర్గాల పునర్విభజన చేయాలి. ప్రస్తుత జనాభాకు అనుగుణంగా ఎస్సీ, ఎస్టీలకు సీట్లు పెంచాలి. అన్ని పార్టీలతో సంప్రదింపులు జరిపాకే లోక్‌సభ పునర్వీభజన చేయాలి. ’ అని సీఎం పేర్కొన్నారు. 'జనాభా లెక్కల ప్రకారం అసెంబ్లీ స్థానాలను 153కు పెంచాలి. ప్రస్తుతం రాష్ట్రంలో 119 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి’ అని రేవంత్ అన్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాలను రాజకీయంగా, సాంస్కృతికంగా అణిచివేయాలని చూస్తోందని తమిళనాడులో రేవంత్, కేటీఆర్ కామెంట్స్ చేశారు. లోక్ సభ నియోజక వర్గాల పునర్విభజన అంశం మళ్లీ చర్చకు రావడంతో దక్షిణాదిలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని రేవంత్ అన్నారు. దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరిగేలా కేంద్రం వ్యవహరిస్తే కచ్చితంగా అందరితో కలిసి కేంద్రానికి ఎదురుగా నిలబడి పోరాటం చేస్తామన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com