తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారు

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారు
X
ఈనెల 15 నుంచి బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. ఈనెల 15 నుంచి బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. 2021-22 బడ్జెట్‌కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 15న ఉదయం 11 గంటలకు గవర్నర్ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభం అవుతాయి. 16న దివంగత ప్రజాప్రతినిధుల మృతి పట్ల సంతాప తీర్మానం ప్రకటిస్తారు. 17న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతారు. 18న పదకొండున్నర గంటలకు ఆర్థిక మంత్రి హరీష్‌రావు రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెడతారు.


Tags

Next Story