Telangana Results: అధికార పీఠం కాంగ్రెస్‌ హస్తగతం

Telangana Results: అధికార పీఠం కాంగ్రెస్‌ హస్తగతం
X
మార్పు కోరుకున్న తెలంగాణ ఓటరు

తెలంగాణ అధికార పీఠం కాంగ్రెస్‌ హస్తగతమైంది. రాష్ట్ర ఓటరు మార్పు మంత్రానికే ఓటేశాడు. కారు దిగి చేయి అందుకున్న ఓటరు పదేళ్ల brs సర్కార్‌ పాలనకు ముగింపు పలుకుతూ కాంగ్రెస్‌కు పాలనా పగ్గాలు అందించాడు. 63స్థానాలతో సంపూర్ణ ఆధిక్యాన్ని సాధించిన హస్తం పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది. కాంగ్రెస్‌ పొత్తుతో కొత్తగూడెం బరిలో నిలిచిన CPI విజయం సాధించింది. 40స్థానాలతో భారాస ప్రతిపక్ష స్థానానికే పరిమితమైంది. దాదాపుగా ఏడుగురు మంత్రులు ఓటమి పాలయ్యారు. మజ్లిస్‌ ఎప్పటిలానే తన ఏడుస్థానాలను పదిలం చేసుకుంది. ఎన్నో ఆశలతో బరిలో దిగిన BSP ఖాతా తెరవలేకపోయింది. కేసీఆర్‌, రేవంత్‌రెడ్డి బరిలో నిలిచిన కామారెడ్డిలో భాజపా అభ్యర్థి వెంకట్రామిరెడ్డి సంచలనం విజయం సాధించారు.

దేశవ్యాప్తంగా ఆసక్తి రేపిన తెలంగాణ అసెంబ్లీ సమరంలో కాంగ్రెస్‌ విజయ దుందుంభి మోగించింది. మార్పు రావాలంటూ కాంగ్రెస్‌ రావాలంటూ జనంలోకి వెళ్లిన హస్తం పార్టీ అధికార పగ్గాలు చేజిక్కించుకుంది. ప్రధాన పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని చేసిన పోరాటంలో కాంగ్రెస్‌ పార్టీకే ఓటర్లు జై కొట్టారు. 119స్థానాల్లో జరిగిన పోలింగ్‌లో కాంగ్రెస్‌ 64స్థానాలతో మిత్రపక్షం CPI ఒక స్థానంతో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన ఆధిక్యం సాధించింది. 2018ఎన్నికల్లో తెలుగుదేశం, వామపక్షాలతో కలిసి మహకూటమిగా పోటీచేసి 19స్థానాలకే పరిమితమైన హస్తం పార్టీ.... ఈ సారి 45స్థానాలు ఎక్కువగా గెలిచింది. ఈ సారి 118స్థానాల్లో పోటీచేసిన కాంగ్రెస్‌ పొత్తులో భాగంగా కొత్తగూడెం స్థానాన్ని CPIకి కేటాయించింది.

హైదరాబాద్‌ మహానగర పరిధి మినహాయిస్తే... జిల్లాల్లో కాంగ్రెస్‌ అత్యధిక స్థానాలు కైవసం చేసుకుంది. ముందుగా ప్రచారం జరుగున్నట్లుగానే ఉమ్మ డి ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో దాదాపుగా అన్ని స్థానాల్ని కైవసం చేసుకుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో పది జిల్లాల్లో భద్రాచలంలో భారాస అభ్యర్థి తెల్లం వెంకట్రావు మాత్రమే విజయం సాధించారు. నల్గొండ జిల్లాలో 12స్థానాలకు గాను సూర్యాపేటలో మంత్రిగా జగదీశ్‌రెడ్డి మాత్రమే గెలుపొందారు. ఉద్యమం నాటి నుంచి కంచుకోటగా ఉన్న ఉమ్మడి వరంగల్‌లోనూ 12స్థానాల్లో ఏకంగా 10స్థానాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులు పాగా వేశారు. ఉమ్మడి కరీంనగర్‌లోనూ 13స్థానాల్లో 8 స్థానాల్లో కాంగ్రెస్‌ గెలవగా ఐదుచోట్ల గులాబీపార్టీ అభ్యర్థులు గెలిచారు

Tags

Next Story