Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం..

Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం..
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు 12, 13 తేదీల్లో నిర్వహించాలని బీఏసీ మీటింగ్‌లో నిర్ణయించా

Telangana Assembly :తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు 12, 13 తేదీల్లో నిర్వహించాలని బీఏసీ మీటింగ్‌లో నిర్ణయించారు. ఈ సమావేశంలో మంత్రి హరీష్ రావు, MIM లీడర్ అక్బరుద్దీన్ ఓవైసీ, సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క పాల్గొన్నారు. అయితే ఈ సమావేశానికి ఆహ్వానం లేకపోవడంతో బీజేపీ ఎమ్మెల్యేలు హాజరుకాలేదు. అసెంబ్లీ సమావేశాల్లో పవర్, అగ్రికల్చర్, ఇరిగేషన్, మైనారిటీ, నిరుద్యోగం, కేంద్ర-రాష్ట్రం మధ్య సంబంధాలు తదితర అంశాలపై చర్చించాలని బీఏసీ సమావేశంలో నిర్ణయించారు. మైనార్టీ అంశాలపై చర్చించాలని ఎంఐఎం, నిరుద్యోగంపై చర్చించాలని కాంగ్రెస్ తెలియజేసింది. కేంద్ర-రాష్ట్ర సంబంధాలపై చర్చించాలని శాసనసభ వ్యవహారాల మంత్రి ప్రశాంత్ రెడ్డి తెలిపారు.

అంతకుముందు అసెంబ్లీ సమావేశాలు సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి. మృతిచెందిన మాజీ ఎమ్మెల్యేలకు సభ సంతాపం తెలిపింది. మల్లు స్వరాజ్యం, పరిపాటి జనార్థన్ మృతికి సంతాపం అనంతరం సభ వాయిదా పడింది. మాజీ ఎమ్మెల్యేల సేవలను స్పీకర్ పోచారం శ్రీనివాస్ కొనియాాడారు.

సీఎం కేసీఆర్ చెప్పింది చేయడం తప్ప.. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మరో పనిచేయడం లేదన్నారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. అవకాశం వస్తే ప్రజా సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడుతాం, లేదంటే ప్రజలతో కలిసి పోరాటాలు చేస్తామన్నారు ఆయన. అసెంబ్లీలో తప్పించుకోవచ్చు కానీ ప్రజల చేతిలో కేసీఆర్ తప్పించుకోలేరన్నారు. భూములు ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. భూములు లాక్కొని ల్యాండ్ బ్రోకర్‌గా మారిందంటూ ఈటల ఘాటు వ్యాఖ్యలు చేశారు. తమ సమస్యలపై అసెంబ్లీలో ప్రస్తావించాలని వీఆర్‌ఏ, వీఆర్ఓలు, గిరిజనులు తమతో చెప్పారన్నారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్.

సభ సంప్రదాయాలను సీఎం కేసీఆర్ తుంగలో తొక్కుతున్నారన్నారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. తమను బీఏసీ సమావేశానికి పిలువలేదన్నారు ఆయన. రాజాసింగ్ ఒక్కరు ఉన్నా బీఏసీ సమావేశానికి పిలిచేవారని.. ఇప్పుడు బీజేపీకి ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నా తమను పిలవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్, కాంగ్రెస్, MIM పార్టీలు ఒక్కొక్క రోజు మాట్లాడి సమావేశాలు ముగిద్దాం అనుకుంటున్నారని ఆరోపించారు రఘునందన్ రావు

Tags

Read MoreRead Less
Next Story