Telangana Bjp: తెలంగాణ నాయకత్వానికి అమిత్ షా దిశానిర్దేశం

Telangana Bjp: తెలంగాణ నాయకత్వానికి అమిత్ షా దిశానిర్దేశం
X
ప్రజల్లో బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉంది ప్రజలు బీజేపీవైపు చూస్తున్నారు

బీజేపీ తెలంగాణ నాయకత్వానికి కేంద్రమంత్రి అమిత్ షా దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. ప్రజల్లో బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని ప్రజలు బీజేపీవైపు చూస్తున్నారని చెప్పారు. ఏదో ఒక యాత్ర పేరుతో ప్రజల్లో ఉండాలని, స్థానిక సమస్యలపై పోరాటాలు చేయాలన్నారు. స్ట్రీట్‌ కార్నర్ సమావేశాలకు సంబంధించి యాప్‌ రూపొందించి ఎప్పటికప్పుడు నివేదికలు ఇవ్వాలని తెలియజేశారు. నోవోటెల్‌ హోటల్‌లో పార్టీ ముఖ్య నేతలతో సమీక్ష నిర్వహించిన షా తెలంగాన తాజా రాజకీయ పరిస్థితులపై వివరాలు తెలుసుకున్నారు.

Tags

Next Story