Telangana BJP : బండి అరెస్ట్ ను ప్రశ్నించిన రఘునందన్ రావు అరెస్ట్

తెలంగాణలో టెన్త్ పేపర్ లీక్స్ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ అరెస్ట్‌తో బీజేపీ శ్రేణులు భగ్గుమన్నాయి. రాత్రి సంజయ్‌ను కరీంనగర్‌లో అరెస్ట్ చేసిన పోలీసులు.. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీంతో పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు బీజేపీ నేతలు. బండి సంజయ్ అరెస్ట్‌పై మండిపడ్డారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు. దీంతో.. ఆయన్ను కూడా అరెస్ట్ చేశారు పోలీసులు. ఆయనతో పాటు మహిళా నేతల్ని సైతం అరెస్ట్ చేశారు పోలీసులు. రఘనందన్‌రావును అరెస్ట్ చేస్తున్నసమయంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పోలీసులు, బీజేపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది.
అర్ధరాత్రి కరీంనగర్‌లో బండి సంజయ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. టెన్త్ క్వశ్చన్ పేపర్ లీక్ ఘటనలో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. కరీంనగర్‌లోని ఆయన నివాసంలోనే అరెస్ట్ చేస్తుండగా కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సంజయ్ అరెస్ట్‌ను కార్యకర్తలు అడ్డుకునేందుకు యత్నించారు. దీంతో భారీగా మోహరించిన పోలీసులు కార్యకర్తలను అదుపుచేసి.. బండి సంజయ్‌ను అదుపులోకి తీసుకున్నారు. బండి సంజయ్‌ను యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం పీఎస్‌కు తరలించారు.
మరోవైపు బండి సంజయ్ అరెస్ట్‌ను బీజేపీ ఖండించింది. అటు యాదాద్రి జిల్లా బొమ్మలరామరం పీఎస్ వద్ద ఉద్రికత్త పరిస్థితులు నెలకొన్నాయి. సంజయ్ అరెస్ట్‌ను నిరసిస్తూ పీఎస్ ఎదుట బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. పోలీస్ స్టేషన్‌లోకి వెళ్లేందుకు యత్నించారు. దీంతో బీజేపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com