Telangana BJP : తెలంగాణలో బీజేపీ దూకుడు

Telangana BJP : తెలంగాణలో బీజేపీ దూకుడు
X
ఈనెల 15న వరంగల్‌.. 18న మహబూబ్‌నగర్‌లో నిరుద్యోగ మార్చ్ నిర్వహిస్తామని బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు

తెలంగాణలో బీజేపీ మరింత దూకుడు పెంచుతోంది. ఉమ్మడి 10 జిల్లాల్లో నిరుద్యోగ మార్చ్‌కు బీజేపీ భారీగా ప్లాన్ చేసింది. ఈనెల 15న వరంగల్‌.. 18న మహబూబ్‌నగర్‌లో నిరుద్యోగ మార్చ్ నిర్వహిస్తామని బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు. తెలంగాణలో ఆరు నెలలుగా పాలన పడకేసిందని ఆరోపించారు. అసలు ముఖ్యమంత్రి ఉన్నారా.. లేరా? అనే అనుమానం కలుగుతోందని చెప్పారు. పాలనపై కాకుండా కేసీఆర్ తన కూతురు లిక్కర్ రాణిని కాపాడేందుకు.. తన కొడుకు లీకువీరుడిని వెనకేసుకురావడంపై ఫోకస్ పెట్టారని విమర్శించారు. కేసీఆర్ కోవర్టులే రాజకీయాలు చేస్తున్నారని ప్రభాకర్ మండిపడ్డారు.

Tags

Next Story