దూకుడు పెంచిన తెలంగాణ బీజేపీ

తెలంగాణలో బీజేపీ దూకుడు పెంచింది. అధికారమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. అభ్యర్థుల ఖరారుపై దృష్టి పెట్టింది. తెలంగాణలో 75 స్థానాల్లో విజయం సాధించేదిశగా వ్యూహాలు రచించాలని అమిత్ షా టీ బీజేపీ నేతలకు సూచించారు. ప్రధానంగా పార్టీలోని బలమైన నేతలంతా ఎన్నికల బరిలో దిగాలని ఆయన ఆదేశించారు. టార్గెట్ 75 దిశగా ముందుకుసాగాలని నేతలకు ఆయన ఉపదేశం చేశారు. తెలంగాణలోని పలు నియోజకవర్గాలకు అభ్యర్థులు ఖరారైనట్టు పార్టీలో ప్రచారం జరుగుతోంది.
అంబర్‌పేట్ నుంచి కిషన్‌రెడ్డి , ముషీరాబాద్ నుంచి కె.లక్ష్మణ్ , కరీంనగర్ నుంచి బండి సంజయ్, బోథ్ - సోయం బాపూరావు ,ఆర్మూర్- ధర్మపురి అర్వింద్, హుజురాబాద్- ఈటల రాజేందర, దుబ్బాక- రఘునందన్‌రావు, గద్వాల- డీకే అరుణ, మహబూబ్‌నగర్ లేదా నారాయణపేట నంచి జితేందర్ రెడ్డి బరిలో నిలిచే అవకాశం ఉంది. మునుగోడు నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, వేములవాడ లేదా కూకట్‌పల్లి నుంచి మురళీధర్‌రావు పోటీ చేస్తారని తెలుస్తోంది.
ఎల్బీ నగర్- ఎన్.ఇంద్రసేనారెడ్డి, చెన్నూరు- వివేక్, మెదక్ నుంచి విజయశాంతి, నిజామాబాద్ అర్బన్ నుంచి యెండల లక్ష్మీనారాయణ, మల్కాజ్‌గిరి నుంచి రామచంద్రరావు, ఉప్పల్- ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ , కల్వకుర్తి- ఆచారి, సికింద్రాబాద్- జయసుధ, నిర్మల్- మహేశ్వర్‌రెడ్డి, ఆసిఫాబాద్- రాథోడ్ రమేష్, ఖమ్మం- పొంగులేటి సుధాకర్‌రెడ్డి, ఆందోల్- బాబూమోహన్ , పటాన్‌చెరు- గడిల శ్రీకాంత్‌గౌడ్ పోటీ చేసే అవకాశం ఉంది.
కుత్బుల్లాపూర్- కూన శ్రీశైలం గౌడ్, భువనగిరి లేదా ఇబ్రహీంపట్నం నుంచి బూర నర్సయ్య గౌడ్ , రాజేంద్రనగర్- విశ్వేశ్వర్‌రెడ్డి, వరంగల్ ఈస్ట్- ఎర్రబెల్లి ప్రదీప్‌రావు, వరంగల్ వెస్ట్- రాకేష్ రెడ్డి, గోషామహల్- విక్రమ్ గౌడ్ , సిర్పూర్ కాగజ్‌నగర్- పాల్వాయి హరీష్‌బాబు, ముధోల్- రామారావు పటేల్,ఖానాపూర్ - రమేష్ రాథోడ్, బాన్సువాడ- యాలాద్రి, చొప్పదండి- బొడిడె శోభ, రామగుండం- సోమారపు సత్యనారాయణ , మంథని- సునీల్ రెడ్డి, వేములవాడ- తుల ఉమ , సంగారెడ్డి- దేశ్‌పాండే, మహేశ్వర్- అందెల శ్రీరాములు యాదవ్, సనత్‌నగర్- మర్రి శశిధర్‌రెడ్డి, కొల్లాపూర్- సుధాకర్‌రావు,అచ్చంపేట- సతీష్ మాదిగ, సూర్యాపేట- సంకినేని వెంకటేశ్వరరావు, జుక్కల్ నుంచి అరుణతార బరిలో నిలుస్తారని తెలుస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com