హుజురాబాద్‌లో ఈటల భారీ మెజార్టీతో గెలవడం ఖాయం : బండి సంజయ్

Bandi Sanjay : హుజురాబాద్‌లో ఈటల రాజేందర్ భారీ మెజార్టీతో గెలవడం ఖాయమన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ఎవరెన్ని కుట్రలు చేసినా గెలుపును ఆపలేరన్నారు. ప్రజలు విజ్ఞతతో ఆలోచించి ఓటు వేయాలన్నారు. అధికారులు ఎన్నికల్లో నిబద్దతతో నిజాయితీతో విధులు నిర్వహిస్తారని ఆశిస్తున్నానన్నారు.
దళితబంధును తామే లేఖలు రాసి ఆపామంటూ టీఆర్‌ఎస్ అతస్య ప్రచారం చేసిందని మండిపడ్డారు బండి సంజయ్. వరి పంట వేయొద్దని చెప్పడానికి మీరెవరన్నారు. వరి వద్దని చెబుతున్న అధికారులపై కూడా న్యాయ పోరాటం చేస్తామని వెల్లడించారు. రైతులకు అండగా ఉంటామని పేర్కొన్నారు.
అటు టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే తనను హుజురాబాద్‌లో గెలిపిస్తాయన్నారు ఆ పార్టీ అభ్యర్ధి గెల్లు శ్రీనివాస్. ప్రచారానికి ఇంకొన్ని గంటలే మిగిలి ఉండటంతో నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఎక్కడికి వెళ్లినా ప్రజలు టీఆర్‌ఎస్‌కే ఓటేస్తామని ధీమా చెబుతున్నారన్నారు.
గతంలో టీఆర్‌ఎస్‌కు ఇక్కడ 43వేల ఓట్ల మెజార్టీ వచ్చిందని.. ఈసారి అంతకంటే ఎక్కువ మెజార్టీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com