Telangana: బీజేపీ అధ్యక్షుడి మార్పుపై మరోసారి చర్చ

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి మార్పుపై మరోసారి చర్చ జరుగుతోంది. బండి సంజయ్‌ని మారుస్తారంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. సంజయ్‌కి వ్యతిరేకంగా హైకమాండ్‌కు పలువురి నేతల ఫిర్యాదులు అందాయి. అధ్యక్షుడి మార్పు ఉంటుందంటున్న బండి వ్యతిరేక వర్గం బలంగా చెబుతోంది. అందరినీ కలుపుకుపోవడం లేదని బండిపై ఫిర్యాదు అందినట్లు తెలుస్తోంది. గత కొంత కాలంగా సంజయ్‌పై ఫిర్యాదులతో హైకమాండ్ అధ్యక్షుడి మార్పం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అధ్యక్షుడిగా ఎవరిని నియమించాలన్న దానిపై చర్చ కొనసాగుతోంది. బండి సంజయ్‌కు కేంద్ర కేబినెట్‌లో చోటు కల్పిస్తారన్న ప్రచారమూ జరుగుతోంది.
మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ కొనసాగుతారని ఆయన వర్గం ధీమాగా చెప్తోంది. పార్టీని బలోపేతం చేయడంలో సంజయ్ కీలకం అంటున్నారు ఆయన సన్నిహితులు. బండి పాదయాత్రతో రాష్ట్రవ్యాప్తంగా పార్టీకి కొత్త జోష్ తెచ్చారని.. చార్మినార్ దగ్గర సభతో హిందుత్వ వాదులకు భరోసా ఇచ్చారని చెప్తున్నారు. ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా నుంచి సంజయ్ ప్రసంశలు అందుకున్నారని గుర్తు చేస్తున్నారు. మొత్తానికి.. బండి సంజయ్‌ను మార్చాల్సిందేనని ఆయన వ్యతిరేక వర్గం అంటుంటే.. మార్చొద్దని హిందుత్వ వాదులు డిమాండ్ చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com