Bandi Sanjay : రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎన్ని స్థానాలు గెలుచుకుంటుందో చెప్పిన బండి సంజయ్..

Bandi Sanjay : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. క్యాసినో సహా అన్ని దందాలల్లో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారని ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో టీఆర్ ఎస్ కేవలం 15 అసెంబ్లీ స్థానాలకే పరిమితం అవుతుందన్నారు. ఉప ఎన్నికలు రావాలని టీఆర్ ఎస్ కోరుకుంటుంటే.. రాకూడదని కాంగ్రెస్ భావిస్తుందని బండిసంజయ్ అన్నారు. అయితే ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది తమ జాతీయ పార్టీ నిర్ణయిస్తుందన్నారు.
ఎవరికి వారు నియోజవర్గాన్ని ఎంపిక చేసుకునే సంప్రదాయం బీజేపీలో ఉందని వ్యాఖ్యానించారు. ఉప ఎన్నికలపై ప్రజల అభిప్రాయమే .. బీజేపీ అభిప్రాయమన్నారు. రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరికపై మీడియాకే ఎక్కువ తెలుసన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టులోని లోపాలపై కేంద్ర జలశక్తి మంత్రికి ఫిర్యాదుచేస్తామన్నారు బండిసంజయ్. లోపాలపై వివేక్ ఆధ్వర్యంలో ఢిల్లీకి బీజేపీ బృందం వెలుతుందన్నారు. ప్రజలు వరదలతో ఇబ్బందులు పడుతుంటే.. కేసీఆర్ కుటుంబం విహారయాత్రలు చేస్తున్నారని దుయ్యబట్టారు. పాతబస్తీపై అమిత్ షా ప్రత్యేక దృష్టిపెట్టారని.. గోషామహాల్‌తోపాటు. నాంపల్లి, యాకత్ పురాలో ఈసారి గెలుస్తామని ధీమావ్యక్తంచేశారు.
పాదయాత్రలో రచ్చబండలు మాత్రమే ఉంటాయని.. బహిరంగ సభలు ఉండవన్నారు. వరంగల్లో పాదయాత్ర ముగింపు సభను గ్రాండ్‌గా నిర్వహించనున్నట్లు బండిసంజయ్ తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com