Telangana BJP : హాట్ హాట్‌గా తెలంగాణ బీజేపీ మీటింగ్..

Telangana BJP : తెలంగాణ ఇన్‌ఛార్జ్ సునీల్ బన్సల్ నేతృత్వంలో రాష్ట్ర బీజేపీ సమీక్షా సమావేశం హాట్ హాట్‌గా సాగింది. ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలపై సునీల్ బన్సల్ రివ్యూ చేశారు. ఈ సమావేశంలో పార్టీ పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పనితీరు మార్చుకోవాలని సూచించారు. ఇలాగే ఉంటే.. అధికారంలోకి ఎలా వస్తామని రాష్ట్ర నేతల్ని ప్రశ్నించారు.
జాతీయ నాయకత్వం స్పీడ్‌ను రాష్ట్ర నేతలు అందుకోలేకపోతున్నారని... పనితీరు మార్చుకోవాలంటూ చురకలు వేసినట్లు తెలుస్తోంది. పనివిభజన చేయాలని, అన్నీ ఒక్కరే చేయాలంటే సాధ్యం కాదని.. నాయకత్వం ఇచ్చిన కార్యచరణను పూర్తి స్థాయిలో అమలు చేయాలని రాష్ట్రనేతల్ని ఆదేశించారు.
నియోజకవర్గాల్లో సమస్యలను అడిగి తెలుసుకున్నారు . సమస్యలపై తీసుకున్న కార్యచరణ ఏంటని ఆరా తీశారు. ఏడాది కాలంగా.. రిజర్వ్ నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతం కోసం ఏం చేసారో చెప్పాలని తెలంగాణ నేతల్ని కోరారు. 41 రిజర్వ్ నియోజకవర్గాలు ఉండటంతో పార్టీ పురోగతి కష్టమన్నారు సునీల్ బన్సల్. ఆయన అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మిన్నకుండిపోయారు తెలంగాణ నేతలు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com