Operation Akarsh: తెలంగాణ బీజేపీ భారీ ఆపరేషన్ ఆకర్ష్.. జిల్లాల వారీగా..

Operation Akarsh: తెలంగాణ బీజేపీ భారీ ఆపరేషన్ ఆకర్ష్‌కు ప్లాన్ సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలో హైకమాండ్‌ను కలవనున్నారు ముఖ్య నేతలు ఈటల, డీకే అరుణ. జిల్లాల వారీగా బీజేపీలో జాయిన్ అయ్యేవారి లిస్ట్‌ను కమిటీ సిద్ధం చేసింది. బీజేపీలో చేరే వారి లిస్ట్‌లో.. నల్లగొండ జిల్లా నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి, టీఆర్‌ఎస్ సీనియర్ నేత కన్నెబోయిన రాజయ్య యాదవ్, పెద్దపల్లి జిల్లాకు చెందిన ఎన్‌ఆర్‌ఐ గొట్టిముక్కల సురేష్‌రెడ్డి, ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ ఎంపీ, కరీంనగర్ జిల్లాకు చెందిన ఇద్దరు టీఆర్‌ఎస్ అసంతృప్త ప్రజాప్రతినిధులు, మహబూబ్‌నగర్‌కు చెందిన ఓ మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే , ఇద్దరు కాంగ్రెస్ నేతలు, రాష్ట్ర సరిహద్దు నియోజకవర్గాలకు చెందిన ఓ ఎమ్మెల్యే ఎంపీ, ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ మాజీ ఎమ్మెల్సీ. ఉన్నారు.ఈ లిస్ట్‌ను హైకమాండ్‌కు అందజేయనున్నారు చేరికల కమిటీ కన్వీనర్ ఈటల రాజేందర్
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com