Etela Rajendar : బంగారు తెలంగాణ కాదు.. అప్పుల తెలంగాణ : ఈటల

Etela Rajendar : కేసీఆర్ తెలంగాణను బంగారు తెలంగాణ కాదు అప్పుల తెలంగాణ మార్చారని బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ దుయ్యబట్టారు. రాష్ట్రం ఏర్పడినప్పుడు 70వేల కోట్ల అప్పు మాత్రమే ఉండేదని, ఇపుడు అది 5 లక్షల కోట్లకు చేరుకుందన్నారు. అలాగే తెలంగాణ ప్రజల ఆకాంక్షలను ఈ ఎనిమిదేళ్లలో కేసీఆర్ ఏ ఒక్కటీ నెరవేర్చలేదని ఫైరయ్యారు. తెలంగాణ ప్రజలు అసహ్యించుకునే స్తాయికి కేసీఆర్ చేరుకున్నాడని విమర్శించారు.
అటు బంగారు తెలంగాణ అంటే ఇదేనా అంటూ ప్రశ్నించారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. తండ్రీకొడుకు కలిసి అవినీతి తెలంగాణగా మార్చారని, అవినీతిని తొవ్వేందుకే అమిత్ షా తెలంగాణకు వచ్చారన్నారు. నిజాం రాజ్యానికి ఇక కాలం చెల్లిందన్నారు. , ఎనిమిదో నిజాంగా భావిస్తున్న కేసీఆర్.. అమిత్ షా ముందు మోకరిల్లడం ఖాయమన్నారు. తెలంగాణలో హిందూ రాజ్యం రాబోతోందని, తెలంగాణలో హిందూ విరోధులను తరమేయాలని పిలుపిచ్చారు.
ఇక తెలంగాణలో అడుగుపెట్టాలంటే కల్వకుంట్ల కుంటుంబం పర్మిషన్ తీసుకోని రావాలా అని మండిపడ్డారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రాష్ట్రాన్ని కేసీఆర్ కుటుంబానికి రాసిచ్చామా? అని ప్రశ్నించారు. తెలంగాణేమి కేసీఆర్ జాగీర్దార్ కాదన్నారు. బీజేపీ బరాబర్ తెలంగాణకు వస్తుందని చెప్పారు. కేసీఆర్‌కు దళితులపై ప్రేమ ఉంటే... దళితుడిని సీఎంగా ప్రకటించే దమ్ముందా అని సవాల్ విసిరారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com